కరీంనగర్‌ బస్టాండ్లలో సౌరపలకలు.. భారీగా తగ్గుతున్న విద్యుత్‌ బిల్లులు

సౌరవిద్యుత్ ఉత్పత్తిపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. భూతాపం తగ్గించేందుకు పలు ప్రణాళికలు అమలుచేస్తున్న కేంద్రం సౌర విద్యుత్‌కు ప్రాధాన్యమిస్తూ రాయితీ అందిస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ స్వయంగా ‘పీఎం సూర్య ఘర్’ పథకంతో ప్రజల్లో చైతన్యం కల్పించారు. ఇప్పటికే కరీంనగర్ ప్రాంతంలో పలువురు సౌరవిద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.

Published : 28 Jun 2024 16:27 IST

సౌరవిద్యుత్ ఉత్పత్తిపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. భూతాపం తగ్గించేందుకు పలు ప్రణాళికలు అమలుచేస్తున్న కేంద్రం సౌర విద్యుత్‌కు ప్రాధాన్యమిస్తూ రాయితీ అందిస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ స్వయంగా ‘పీఎం సూర్య ఘర్’ పథకంతో ప్రజల్లో చైతన్యం కల్పించారు. ఇప్పటికే కరీంనగర్ ప్రాంతంలో పలువురు సౌరవిద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. కరీంనగర్‌ ఆర్టీసీ పరిధిలోని మంథని, గోదావరిఖని, కోరుట్ల, మెట్‌పల్లి, జగిత్యాల, హుజురాబాద్‌, హుస్నాబాద్‌, సిరిసిల్ల బస్టాండ్లలో సౌరపలకలు ఏర్పాటు చేశారు. దీంతో నెలవారీగా వచ్చే విద్యుత్‌ బిల్లులను భారీగా ఆదా చేస్తున్నారు.

Tags :

మరిన్ని