CM Revanth: కేసీఆర్‌కు ఇప్పటికీ కనువిప్పు కలగలేదు: సీఎం రేవంత్‌రెడ్డి

పార్టీ ఫిరాయింపులకు పునాది వేసిందే మాజీ సీఎం కేసీఆర్ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు.

Published : 27 Jun 2024 15:04 IST

పార్టీ ఫిరాయింపులకు పునాది వేసిందే మాజీ సీఎం కేసీఆర్ (KCR) అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించినందుకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని  డిమాండ్ చేశారు. గతంలో 61 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కేసీఆర్ లాక్కున్నారన్నారు. ‘మా ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే కూలిపోతుందని కేటీఆర్, హరీశ్‌రావు అన్నారు. మా ప్రభుత్వాన్ని కూలగొడతామంటుంటే గాలికి వదిలేయాలా?’ అని సీఎం ప్రశ్నించారు. ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అనుభవాలను పార్టీ వినియోగించుకుంటుందని, రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తామని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు.

Tags :

మరిన్ని