CM Chandrababu: నేడు ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశం కానున్నారు.

Published : 04 Jul 2024 09:21 IST

ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశం కానున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల చివరి వారంలో పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న తరుణంలో ఏపీ అవసరాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు. బుధవారం రాత్రే దిల్లీ చేరుకున్న ఆయన.. గురువారం ప్రధానితో పాటు కేంద్రమంత్రులనూ కలవనున్నారు.

Tags :

మరిన్ని