CM Chandrababu: మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు.. ఆరుద్రకు రూ.5 లక్షల చెక్కు

వైకాపా హయాంలో నరక యాతన అనుభవించిన కాకినాడకు చెందిన ఆరుద్రకు ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నేరవేర్చారు. వెన్నుపూస తీవ్రంగా దెబ్బతిని అచేతనమై వీల్ చైర్‌కే పరిమితమైన ఆరుద్ర కుమార్తె సాయిలక్ష్మీచంద్ర వైద్యం కోసం రూ.5 లక్షల సాయాన్ని అందజేశారు.

Published : 27 Jun 2024 15:06 IST

వైకాపా హయాంలో నరక యాతన అనుభవించిన కాకినాడకు చెందిన ఆరుద్రకు ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నేరవేర్చారు. వెన్నుపూస తీవ్రంగా దెబ్బతిని అచేతనమై వీల్ చైర్‌కే పరిమితమైన ఆరుద్ర కుమార్తె సాయిలక్ష్మీచంద్ర వైద్యం కోసం రూ.5 లక్షల సాయాన్ని అందజేశారు. సచివాలయంలో బాధితులకు సీఎంవో అధికారులు చెక్కును అందజేశారు. జగన్ ప్రభుత్వంలో తనపై అక్రమంగా కేసులు పెట్టి వేధించారని ఆరుద్ర వాపోయారు. నాడు ప్రతిపక్ష నేతగా అండగా నిలిచిన చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే అన్ని విధాలా ఆదుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని