చార్‌ధామ్‌ యాత్ర పేరిట ప్రయాణికులకు కుచ్చుటోపీ.. రూ.కోటితో ట్రావెల్‌ ఏజెంట్‌ పరార్‌!

చార్‌ధామ్‌ యాత్ర పేరుతో యాత్రికులను బురిడీ కొట్టించాడు ఓ ప్రబుద్ధుడు. డబ్బులు గుంజుకుని యాత్ర పూర్తికాకుండానే మధ్యలోనే వదిలేసి వచ్చేశాడు.

Updated : 29 Jun 2024 18:42 IST

చార్‌ధామ్‌ యాత్ర పేరుతో యాత్రికులను బురిడీ కొట్టించాడు ఓ ప్రబుద్ధుడు. డబ్బులు గుంజుకుని యాత్ర పూర్తికాకుండా మధ్యలోనే వదిలేసి వచ్చేశాడు. అనంతపురానికి చెందిన ఉదయ్.. ట్రావెల్ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. చార్‌ధామ్‌ యాత్రకు తీసుకెళ్తామని ప్రచారం చేయడంతో అనంతపురం, బెంగళూరుకు చెందిన 90 మంది.. రూ.60 వేల చొప్పున చెల్లించారు. జూన్ 18న యాత్రకు బయలుదేరారు. బెంగళూరు నుంచి దేహ్రాదూన్‌ వరకు విమానంలో వెళ్లిన యాత్రికులను.. ఏజెంట్ ఉదయ్ హోటల్‌కు తీసుకెళ్లాడు. యాత్రికుల నుంచి సుమారు కోటి రూపాయలు వసూలు చేశాడు. బద్రీనాథ్ ఆలయానికి వెళ్లేందుకు యాత్రికులు బస్సులో కూర్చున్నారు. ఎంతకీ బస్సు బయలుదేరకపోవడంతో డ్రైవర్‌ను ప్రశ్నించగా.. ఏజెంట్ తనకు డబ్బులివ్వలేదని, మిమ్మల్ని తీసుకెళ్లలేనని తెగేసి చెప్పాడు. యాత్రికులు ట్రావెల్ ఏజెంట్‌కు ఫోన్ చేయగా స్విచాఫ్ వచ్చింది. మోసపోయామని గ్రహించిన యాత్రికులు కుటుంబసభ్యులకు ఫోన్ చేసి టికెట్లు బుక్ చేయించుకుని అవస్థలు పడుతూ తిరిగి సొంతూరికి చేరుకున్నారు. 

Tags :

మరిన్ని