Crime News: ఆడుకుంటున్న పాపపైకి ఎక్కిన కారు.. చిన్నారి పరిస్థితి విషమం

ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ పసికందు పైకి కారు ఎక్కిన ఘటన నోయిడాలోని సెక్టార్ 63లో జరిగింది.

Updated : 29 Jun 2024 19:01 IST

ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ పసికందు పైకి కారు ఎక్కిన ఘటన నోయిడాలోని సెక్టార్ 63లో జరిగింది. ఈ దుర్ఘటనలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. తల్లితో కలిసి చిన్నారి ఆడుకుంటోంది. అదే సమయంలో మూల మలుపు తిరుగుతూ వచ్చిన ఓ కారు పాప పైకి ఎక్కింది. కారు రెండు టైర్లూ పాప పైనుంచి వెళ్లాయి. వెంటనే అక్కడకు చేరుకున్న స్థానికులు.. నిర్లక్ష్యంతో వేగంగా కారును నడిపిన డ్రైవర్‌ను చితకబాదారు. ప్రస్తుతం పాప పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

Tags :

మరిన్ని