salman khan: సల్మాన్ హత్యకు కుట్ర.. రూ. 25 లక్షల సుపారీ!

బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ హత్యకు బిష్ణోయ్‌ గ్యాంగ్‌ పన్నిన భారీ కుట్ర దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.

Updated : 02 Jul 2024 20:36 IST

బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ హత్యకు బిష్ణోయ్‌ గ్యాంగ్‌ పన్నిన భారీ కుట్ర దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్‌లో సల్మాన్‌ఖాన్‌ ఇంటిపై కాల్పుల కేసు దర్యాప్తులో ఒళ్లు జలదరించే వాస్తవాలు బయటపడ్డాయి. నవీ ముంబయి పోలీసులు ఈమేరకు దాఖలు చేసిన 350 పేజీల ఛార్జిషీట్‌లో కీలక అంశాలు ప్రస్తావించారు. సల్మాన్‌ హత్యకు ఆ గ్యాంగ్‌ పక్కా ప్లానింగ్‌తో వ్యవహరిస్తోందని పోలీసులు తెలిపారు. పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య తరహాలో కారులోనే సల్మాన్‌ను అంతమొందిచేందుకు రూ.25 లక్షల సుఫారీని ఆ గ్యాంగ్‌ తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Tags :

మరిన్ని