Balakrishna: అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య

హిందూపురం ఎమ్మెల్యే, అగ్రనటుడు బాలకృష్ణ (Balakrishna) తన అభిమానితో కలిసి భోజనం చేశారు.

Updated : 28 Jun 2024 20:39 IST

హిందూపురం ఎమ్మెల్యే, అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna) తన అభిమానితో కలిసి భోజనం చేశారు. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు రాక్ గార్డెన్స్‌లో బాలయ్య 109వ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆదోని నందమూరి యువసేన సేవా సంస్థ అధ్యక్షుడు సజాద్‌కు బాలయ్య కబురు పంపారు. అతడు భార్య, కుమారుడితో కలిసి శనివారం మధ్యాహ్నం షూటింగ్స్ స్పాట్‌లో బాలకృష్ణను కలిశారు. ఈ సందర్భంగా అభిమాని కుటుంబంతో కలిసి బాలయ్య భోజనం చేశారు. 

Tags :

మరిన్ని