Pawan Kalyan: కొండగట్టు అంజన్న సన్నిధికి పవన్‌.. అభిమానుల ఘనస్వాగతం

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామిని నేడు దర్శించుకోనున్నారు.

Published : 29 Jun 2024 13:07 IST

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామిని నేడు దర్శించుకోనున్నారు. ఈ ఉదయం హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన ఆయనకు.. మార్గమధ్యలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. తుర్కపల్లి క్రాస్ రోడ్స్ వద్ద జనసేన నాయకులు గజమాలతో ఆయనను సత్కరించారు.  రాజీవ్ రహదారిపై అడుగడుగునా పవన్ కల్యాణ్ నినాదాలతో అభిమానులు హోరెత్తించారు.

Tags :

మరిన్ని