Chandababu: ఏపీ సీఎం చంద్రబాబుకు హైదరాబాద్‌లో ఘనస్వాగతం.. వర్షంలోనూ కొనసాగిన ర్యాలీ

ఏపీ సీఎం చంద్రబాబుకు (Chandrababu) హైదరాబాద్‌లో తెదేపా శ్రేణుల నుంచి ఘనస్వాగతం లభించింది.

Published : 05 Jul 2024 20:22 IST

ఏపీ సీఎం చంద్రబాబుకు (Chandrababu) హైదరాబాద్‌లో తెదేపా శ్రేణుల నుంచి ఘనస్వాగతం లభించింది. దిల్లీ పర్యటన ముగించుకుని బేగంపేట విమనాశ్రయానికి చేరుకున్న ఆయనకు తెలంగాణ తెదేపా నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు తొలిసారి నగరానికి వచ్చిన నేపథ్యంలో పార్టీ నేతలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాహనంపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ చంద్రబాబు ముందుకు సాగారు. ఓ వైపు భారీ వర్షం కురుస్తున్నప్పటికీ లెక్క చేయకుండా అభిమానులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు.

Tags :

మరిన్ని