Pulivendula: పులివెందులలో ‘ఫోర్‌ స్టార్‌’ పన్నాగం

ఎక్కడైనా సందర్శకులు, పర్యాటకులు వచ్చే ప్రాంతాల్లో స్టార్ హోటళ్లు కడతారు. కానీ మన మాజీ సీఎం జగన్ సారు మాత్రం సందర్శకులే రాని పులివెందుల్లో స్టార్ హోటల్  కట్టేందుకని ప్రైవేటు క్లబ్ హౌస్‌ను ఏపీటీడీతో రూ.12.87 కోట్లతో కొనిపించారు.

Published : 03 Jul 2024 10:35 IST

ఎక్కడైనా సందర్శకులు, పర్యాటకులు వచ్చే ప్రాంతాల్లో స్టార్ హోటళ్లు కడతారు. కానీ మన మాజీ సీఎం జగన్ సారు మాత్రం సందర్శకులే రాని పులివెందుల్లో స్టార్ హోటల్  కట్టేందుకని ప్రైవేటు క్లబ్ హౌస్‌ను ఏపీటీడీతో రూ.12.87 కోట్లతో కొనిపించారు. అంతేనా మరో రూ.23.50 కోట్లతో దాన్ని స్టార్ హోటల్‌గా మార్చేందుకు టెండర్లు పిలిపించారు. ఇంతకీ ఈ ప్రైవేటు క్లబ్ హౌస్ ఎవరిదో తెలుసా వివేకా హత్య కేసులో నిందితుడైన కడప ఎంపీ అవినాష్ రెడ్డికి బావ వరసయ్యే విజయభాస్కర్ రెడ్డిది. దీనికి పర్యాటక శాఖ అధికారులు సైతం వంతపాడారు. తన సొంత వారికి మేలు చేసేందుకు రాష్ట్ర వనరుల్ని ఎలా వాడేసుకున్నారో చెప్పేందుకు ఈ ఘటన ఓ పెద్ద ఉదాహరణ.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు