SreeLeela: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి శ్రీలీల

తిరుమల శ్రీవారిని సినీ నటి శ్రీలీల దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి అష్టదళ పాదపద్మారాధన సేవలో ఆమె పాల్గొన్నారు.

Published : 25 Jun 2024 13:37 IST

తిరుమల శ్రీవారిని సినీ నటి శ్రీలీల దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి అష్టదళ పాదపద్మారాధన సేవలో ఆమె పాల్గొన్నారు. దర్శన అనంతరం శ్రీలీలకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల మీడియాతో శ్రీలీల మాట్లాడారు. శ్రీవారి దర్శనం చాలా సంతోషకరంగా జరిగిందని తెలిపారు. ఏదైనా ప్రారంభించేటప్పుడు స్వామివారిని దర్శించుకోవడం తనకు అలవాటు అని ఆమె చెప్పారు. 

Tags :

మరిన్ని