Nikhil: నిఖిల్‌ హీరోగా పాన్‌ ఇండియా చిత్రం.. ‘ది ఇండియా హౌస్‌’ ప్రారంభం

కథానాయకుడు రామ్‌చరణ్‌ సమర్పణలో నిఖిల్‌ (Nikhil)- సయీ మంజ్రేకర్‌ (Saiee Manjrekar) జంటగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘ది ఇండియా హౌస్‌’.

Published : 02 Jul 2024 17:20 IST

కథానాయకుడు రామ్‌చరణ్‌ సమర్పణలో నిఖిల్‌ (Nikhil)- సయీ మంజ్రేకర్‌ (Saiee Manjrekar) జంటగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘ది ఇండియా హౌస్‌’. రామ్‌ వంశీకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనుపమ్‌ ఖేర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. హంపిలోని విరూపాక్ష దేవాలయంలో పూజా కార్యక్రమాలతో సోమవారం ఈ చిత్రం ప్రారంభమైంది. 1905 నేపథ్యంలో ప్రేమ, విప్లవం అంశాలతో నిండి ఉన్న ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రూపొందుతున్నట్లు సమాచారం.

Tags :

మరిన్ని