MLA Adireddyvasu: సైకిల్‌కు ఓటేసింది నీకే కదా.. ఎమ్మెల్యే ఆదిరెడ్డివాసుతో చిన్నారి వీడియో వైరల్‌

రాజమండ్రి తెదేపా ఎమ్మెల్యే ఆదిరెడ్డివాసుతో ఓ చిన్నారి తమాషా చేసిన వీడియా వైరల్‌గా మారింది.

Updated : 30 Jun 2024 18:55 IST

రాజమహేంద్రవరం తెదేపా ఎమ్మెల్యే ఆదిరెడ్డివాసుతో ఓ చిన్నారి మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. ఓ ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి పుస్తకాలు పంపిణీ చేశారు. ఆ సమయంలో ఓ బుడతడు ‘సైకిల్‌కు ఓటేసింది నీకే కదా’ అని అనడంతో, మొదట ఎమ్మెల్యేకు సరిగా వినపడలేదు. కిందకు వంగి మళ్లీ ఆ చిన్నారిని అడగ్గా అవే మాటలు చెప్పడంతో ఆయన ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని పక్కనే ఉన్నవారితో పంచుకోవడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతోంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు