Nara Bhuvaneswari: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన నారా భువనేశ్వరి

నిరుపేద చిన్నారులకు అదో అక్షరాల గుడి.. తల్లిదండ్రుల్లేని వారిని అక్కున చేర్చుకున్న అమ్మ ఒడి..అదే కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పాగోలులోని ఎన్టీఆర్‌ మోడల్‌ స్కూల్‌.

Published : 29 Jun 2024 12:30 IST

నిరుపేద చిన్నారులకు అదో అక్షరాల గుడి.. తల్లిదండ్రుల్లేని వారిని అక్కున చేర్చుకున్న అమ్మ ఒడి..అదే కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పాగోలులోని ఎన్టీఆర్‌ మోడల్‌ స్కూల్‌. 400 మందికిపైగా అనాథలు, పేద పిల్లలకు అమ్మానాన్న అన్నీ తానై చదివిస్తున్న ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి శుక్రవారం పాఠశాలలో కనిపించేసరికి విద్యార్థులు, సిబ్బంది భావోద్వేగానికి గురయ్యారు. భువనేశ్వరి పిల్లలతో కలిసి భోజనం చేసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తొలుత దివంగత నందమూరి తారకరామారావు చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ ఇక్కడి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారని, ఇటీవల పదో తరగతిలో భవఘ్నిసాయి రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించడం సంతోషదాయకమని అన్నారు. 

Tags :

మరిన్ని