Kalki 2898 AD: థీమ్‌ ఆఫ్‌ కల్కి.. మథురలో శోభన నృత్య ప్రదర్శన

‘థీమ్‌ ఆఫ్‌ కల్కి’ పేరుతో ‘కల్కి 2898 ఏడీ’ చిత్ర బృందం స్పెషల్‌ వీడియోను విడుదల చేసింది

Updated : 24 Jun 2024 13:57 IST

Kalki 2898 AD: ప్రభాస్‌ నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ జూన్‌ 27న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ‘థీమ్‌ ఆఫ్‌ కల్కి’ పేరుతో ఓ వీడియోను విడుదల చేసింది. నటి శోభన, పలువురు నృత్యకారిణులు మథురలో నృత్య ప్రదర్శన చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను చిత్ర బృందం పంచుకుంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ నిర్మిస్తోంది.

Tags :

మరిన్ని