The GOAT: విజయ్‌ డబుల్‌ ‘యాక్షన్‌’.. వీడియో అదిరింది

విజయ్‌ హీరోగా రూపొందుతున్న ‘ది గోట్‌’ చిత్రం నుంచి ప్రత్యేక వీడియో విడుదలైంది.

Published : 22 Jun 2024 09:31 IST

విజయ్‌ (Thalapathy Vijay) హీరోగా దర్శకుడు వెంకట్‌ ప్రభు (Venkat Prabhu) తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది గోట్‌’ (ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌) (The GOAT). మీనాక్షీ చౌదరి కథానాయిక. శనివారం విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ప్రత్యేక వీడియోను అభిమానులతో పంచుకుంది. డైలాగ్స్‌ లేకుండా యాక్షన్ సన్నివేశాలనే హైలైట్‌ చేస్తూ తీర్చిదిద్దిన వీడియో అందరినీ ఆకట్టుకునేలా ఉంది. విజయ్‌ డబుల్‌ రోల్‌లో కనిపించి ఫ్యాన్స్‌కు ట్రీట్‌ ఇచ్చారు. సినిమా సెప్టెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

మరిన్ని