TG News: మమ్మల్ని వదిలి వెళ్లొద్దు సార్‌.. టీచర్ బదిలీతో భావోద్వేగానికి గురైన విద్యార్థులు

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని సన్మార్గంలో నడిపించే మార్గదర్శి గురువు. తల్లిదండ్రుల తర్వాత అంతటి బాధ్యత చూపే ఆదర్శమూర్తి ఉపాధ్యాయుడు.

Updated : 28 Jun 2024 13:10 IST

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని సన్మార్గంలో నడిపించే మార్గదర్శి గురువు. తల్లిదండ్రుల తర్వాత అంతటి బాధ్యత చూపే ఆదర్శమూర్తి ఉపాధ్యాయుడు. గురు-శిఘ్యల బంధానికి ప్రతీకగా నిలిచే అపురూప ఘట్టానికి వేదికైంది సూర్యాపేట జిల్లా పోలుమల్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల. 14 ఏళ్లుగా అదే బడిలో పనిచేస్తున్న.. తెలుగు ఉపాధ్యాయుడు సైదులు బదిలీపై వెళ్తున్న వేళ పాఠశాల ఆవరణలో ఉద్వేగభరిత దృశ్యం ఆవిష్కృతమైంది. పదోన్నతితో వెళ్తున్న తెలుగు ఉపాధ్యాయుడు సైదులుకు వీడ్కోలు సందర్భంగా విద్యార్థులంతా బోరున విలపించారు. 

Tags :

మరిన్ని