Rohit-Hardik: హార్దిక్‌కు ముద్దు ఇచ్చిన రోహిత్‌.. స్వీట్‌ మూమెంట్‌ చూశారా..

టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన అనంతరం భారత ఆటగాళ్లు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. హార్దిక్‌ పాండ్య మాట్లాడుతుండగా.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ముద్దు ఇచ్చాడు.  

Published : 30 Jun 2024 01:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ టీ20 ప్రపంచకప్‌ సాధించిన వేళ.. బ్రిడ్జ్‌టౌన్‌ స్టేడియంలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా సాగిన ఫైనల్‌లో భారత్‌ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. ఇక మ్యాచ్‌ అనంతరం స్టేడియంలోని అభిమానులతో పాటు ఆటగాళ్లు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇదే క్రమంలో హార్దిక్‌ మాట్లాడుతుండగా.. రోహిత్‌శర్మ వచ్చి ముద్దు ఇచ్చాడు. ప్రస్తుతం ఈ స్వీట్‌ మూమెంట్‌ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు