Rishab Pant: హార్దిక్‌ షార్ట్‌ బాల్‌.. పంత్‌ సూపర్‌ క్యాచ్‌

హార్దిక్‌ బౌలింగ్‌లో షార్ట్‌ బంతిని అమెరికా బ్యాటర్‌ అండర్సన్‌ గాల్లోకి లేపగా.. కీపర్‌ రిషబ్‌ పంత్‌ సూపర్‌ క్యాచ్‌ పట్టాడు.   

Published : 13 Jun 2024 01:20 IST

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో నెగ్గి సూపర్‌-8కి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాటర్‌ కోరె అండర్సన్‌ 16.5 ఓవర్ల వద్ద ఔట్‌ అయ్యాడు. హార్దిక్‌ వేసిన షార్ట్‌ బంతిని అండర్సన్‌ భారీ షాట్‌ కొట్టే క్రమంలో అది ఎడ్జ్‌ అయి గాల్లోకి లేచింది. దీంతో కీపర్‌ పంత్‌ స్క్వేర్‌ లెగ్‌ దిశలో వేగంగా పరిగెత్తి ఎలాంటి పోరపాటు చేయకుండా చక్కగా ఒడిసిపట్టాడు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు