Rishabh Pant: మ్యాచ్‌కే హైలైట్ షాట్.. సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించిన రిషభ్ పంత్

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 97 పరుగుల లక్ష్యాన్ని భారత్ 12.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

Updated : 06 Jun 2024 17:31 IST

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 97 పరుగుల లక్ష్యాన్ని భారత్ 12.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రిషభ్‌ పంత్ (Rishabh Pant) (36*; 26 బంతుల్లో) రాణించాడు. పంత్ 13 ఓవర్‌లో రెండో బంతికి రివర్స్‌ స్కూప్‌ షాట్‌తో వికెట్‌ కీపర్‌ తలమీదుగా సిక్సర్‌ సాధించి మ్యాచ్‌ను ముగించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను చూసిన అభిమానులు మళ్లీ పాత పంత్‌ను చూస్తున్నామని కామెంట్లు చేస్తున్నారు. 2022 చివరిలో రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఈ ఐపీఎల్‌ సీజన్‌తో పునరాగమనం చేసిన సంగతి తెలిసిందే. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు