SWAG Movie: ‘స్వాగ్‌’ కోసం శ్రీవిష్ణు 4 గంటల మేకప్‌.. వీడియో చూశారా?

స్వాగ్‌ మూవీలో శ్రీవిష్ణు వయసు మళ్లిన ఎస్సై పాత్రలో కనిపించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సిద్ధమయ్యారు.

Published : 21 Jun 2024 19:01 IST

శ్రీవిష్ణు కథానాయకుడిగా  పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘స్వాగ్‌’. హసిత్‌ గోలి దర్శకత్వం వహిస్తున్నారు. రీతూ వర్మ కథానాయిక. మీరా జాస్మిన్‌, దక్షా నగర్కర్‌, శరణ్య ప్రదీప్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ మూవీలో దివాకర్ పేట ఎస్‌ఐ భవభూతిగా శ్రీవిష్ణు సందడి చేయనున్నారు. వయసు మళ్లిన పాత్రలో కనిపించేందుకు ప్రముఖ మేకప్‌ ఆర్టిస్ట్‌ రషీద్‌ శ్రీవిష్ణును ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఇందుకోసం నాలుగు గంటల సమయం పట్టింది. మరి ఆ మేకోవర్‌ వీడియోను మీరూ చూసేయండి.

Tags :

మరిన్ని