Kalki 2898 AD: ‘కల్కి 2898 ఏడీ’.. కాంప్లెక్స్‌ సాంగ్‌ వచ్చేసింది

‘కల్కి’లో అలరించిన కాంప్లెక్స్‌ సాంగ్‌ ఫుల్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.

Published : 29 Jun 2024 13:34 IST

ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ  సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ప్రభాస్‌, అమితాబ్ యాక్షన్‌ సీన్స్‌, నాగ్‌ అశ్విన్‌ టేకింగ్‌ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ‘టక టక్కర’ అంటూ కాంప్లెక్స్‌లో సాగే పాటను విడుదల చేసింది. ప్రపంచంలో ఉన్న వనరులన్నీ కలిగిన కాంప్లెక్స్‌కు భైరవ (ప్రభాస్‌), రోక్సీ (దిశా పటానీ) వెళ్తారు. అక్కడకు వెళ్లాక వాళ్లు చూసిన వింతలేంటి? ఎలాంటి అనుభూతిని పొందారో సాంగ్‌లో బాగా చూపించారు. ఇంకెందుకు ఆలస్యం ఆ పాటను మీరూ చూసేయండి.

Tags :

మరిన్ని