Janka Aithe Ganaka: ఆ డెసిషన్‌ నా లైఫ్‌ని మార్చేసింది: ఆసక్తిగా ‘జనక అయితే గనక’ టీజర్‌

సుహాస్‌ ప్రధాన పాత్రలో సందీప్‌రెడ్డి బండ్ల తెరకెక్కిస్తున్న చిత్రం ‘జనక అయితే గనక’. తాజాగా టీజర్‌ విడుదలైంది.

Published : 04 Jul 2024 16:34 IST

వైవిధ్య కథలను ఎంపిక చేసుకుంటూ విజయాలు అందుకున్న నటుడు సుహాస్‌ (Suhas). ఆయన తాజా చిత్రం ‘జనక అయితే గనక’ (Janaka Aithe Ganaka). వెన్నెల కిశోర్‌, రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సందీప్‌రెడ్డి బండ్ల దర్శకుడు. ప్రచారంలో భాగంగా చిత్ర బృందం టీజర్‌ని (Janaka Aithe Ganaka Teaser) గురువారం విడుదల చేసింది. ‘ఆ ఒక్క డెసిషన్‌ నా లైఫ్‌ని మార్చేసింది’ అంటూ హీరో తన పరిస్థితి గురించి చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన టీజర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. తాను అనుకున్న విధంగా బెస్ట్‌ ఇవ్వలేనేమోననే భయంతో సంతానం వద్దనుకునే మధ్యతరగతి వ్యక్తిగా సుహాస్‌ నటన ఆకట్టుకునేలా ఉంది.

Tags :

మరిన్ని