Hardik Pandya: ద్రవిడ్‌ను హత్తుకొని కన్నీళ్లు పెట్టుకున్న హార్దిక్‌ పాండ్య

టీ20 ప్రపంచకప్‌ గెలిచిన అనంతరం హార్దిక్‌ పాండ్య కన్నీళ్లు పెట్టాడు. 

Updated : 30 Jun 2024 00:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ రెండో సారి ప్రపంచ విజేతగా నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌ పోరులో 7 పరుగుల తేడాతో విజయం సాధించి పొట్టికప్పును ముద్దాడింది. ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్య మూడు వికెట్లు తీసిన భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. చివరి ఓవర్‌లో దక్షిణాఫ్రికా విజయ లక్ష్యం 16 పరుగులు కాగా, హార్దిక్‌ పాండ్య రెండు వికెట్లు తీసి కేవలం 8 పరుగులే ఇచ్చి మ్యాచ్‌ను గెలిపించాడు. ప్రపంచకప్‌ ముందు వరకు తీవ్రమైన నెగెటివిటీని ఎదుర్కొన్న హార్దిక్‌.. మ్యాచ్‌ అనంతరం కోచ్‌ ద్రవిడ్‌ను హత్తుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు.    

Tags :

మరిన్ని