Batti Vikramarka: ప్రతి ఇంటికీ భారాస నీళ్లిస్తే.. రూ.125 కోట్లతో మళ్లీ పనులు ఎందుకు చేపడతాం?: భట్టి

భారాస పాలనలో మిషన్ భగీరథకు రూ.42 వేల కోట్లు ఖర్చు పెట్టినా ఇప్పటికీ చాలా గ్రామాలకు మంచి నీళ్లు అందివ్వలేదని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.

Published : 27 Jun 2024 15:29 IST

భారాస పాలనలో మిషన్ భగీరథకు రూ.42 వేల కోట్లు ఖర్చు పెట్టినా ఇప్పటికీ చాలా గ్రామాలకు మంచి నీళ్లు అందివ్వలేదని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రులు భట్టి, కోమటిరెడ్డి, తుమ్మల, పొంగులేటితో కలిసి రూ.234 కోట్లతో మంచినీటి పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. ప్రతి ఇంటికీ పూర్తిస్థాయిలో నీళ్లిచ్చామని గత ప్రభుత్వం చెప్పిందని భట్టి తెలిపారు. ప్రతి ఇంటికీ నీళ్లిస్తే రూ.125 కోట్లతో మళ్లీ ఎందుకు పనులు చేపడతామని ప్రశ్నించారు. ప్రాధాన్యాల మేరకు పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని మంత్రి అన్నారు.

Tags :

మరిన్ని