Indian 2: ‘భారతీయుడు 2’ క్యాలెండర్‌ సాంగ్‌.. ఆకట్టుకుంటున్న ‘మిస్‌ యూనివర్స్‌ 2017’

‘భారతీయుడు 2’ సినిమాలోని కొత్త పాట విడుదలైంది. ఇందులో మిస్‌ యూనివర్స్‌ 2017 నటించడం విశేషం.

Updated : 01 Jul 2024 18:32 IST

క్రేజీ సీక్వెల్‌ ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2) జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచారంలో భాగంగా ‘క్యాలెండర్‌ సాంగ్‌’ (Calender Song)ను సోమవారం విడుదల చేసింది. ఈ పాటలో మిస్‌ యూనివర్స్‌ 2017 (Miss Universe 2017) విన్నర్‌ డెమీ లీ టెబో (Demi-Leigh Tebow) నటించడం విశేషం. ఈ లిరికల్‌ వీడియోలోని విజువల్స్‌, డెమీ డ్యాన్స్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. కమల్ హాసన్‌ (Kamal Haasan) హీరోగా దర్శకుడు శంకర్‌ (Directro Shankar) తెరకెక్కిస్తున్న చిత్రమిది.

Tags :

మరిన్ని