Bharateeyudu 2 Trailer: ‘భారతీయుడు 2’ ట్రైలర్‌ వచ్చేసింది

సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘భారతీయుడు 2’ ట్రైలర్‌ మంగళవారం విడుదలైంది. కమల్‌ హాసన్‌ హీరోగా దర్శకుడు శంకర్‌ రూపొందించిన చిత్రమిది.

Updated : 25 Jun 2024 19:07 IST

Bharateeyudu 2 Trailer: నటుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan)- దర్శకుడు శంకర్‌ (Shankar) కాంబినేషన్‌లో 1996లో వచ్చిన హిట్‌ చిత్రం ‘భారతీయుడు’. ఇదే కాంబోలో దానికి సీక్వెల్‌గా రూపొందిన ‘భారతీయుడు 2’ (bharateeyudu 2) జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ను (Indian 2 Trailer) సోషల్‌ మీడియా వేదికగా మంగళవారం విడుదల చేసింది. దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతిని అంతమొందించడానికి సేనాపతి (హీరో పాత్ర) ఈసారి ఏం చేశాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇందులో కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సిద్ధార్థ్‌ కీలక పాత్రలు పోషించారు.

Tags :

మరిన్ని