Axar Patel: వావ్‌.. ఒంటి చేత్తో సూపర్‌ క్యాచ్‌ అందుకున్న అక్షర్‌ పటేల్‌

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అక్షర్‌ పటేల్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌తో అదరగొట్టాడు. కీలక సమయంలో బౌండరీ వద్ద ఒంటి చేత్తో క్యాచ్‌ అందుకుని దూకుడుగా ఆడుతున్న మిచెల్‌మార్ష్‌ను ఔట్‌ చేశాడు. 

Published : 25 Jun 2024 01:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పొట్టిపోరులో భాగంగా సూపర్‌-8 మ్యాచ్‌లో ఆసీస్‌ను 24 పరుగుల తేడాతో ఓడించి భారత్‌ సగర్వంగా సెమీస్‌ చేరింది. భారత్‌ నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులకు పరిమితం అయింది. ఆ జట్టులో ట్రావిస్‌ హెడ్‌ (74), మిచెల్‌ మార్స్‌(37) భారత బౌలర్లపై విరుచుపడ్డాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని అక్షర్‌ పటేల్‌ అద్భుత క్యాచ్‌తో విడదీశాడు. కుల్‌దీప్‌ వేసిన 9వ ఓవర్‌ చివరి బంతికి మిచెల్‌ భారీ షాట్‌ కొట్టగా.. బౌండరీ వద్ద ఉన్న అక్షర్‌ అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో ఒడిసి పట్టాడు. దీంతో స్టేడియంలోని ఆటగాళ్లు, ప్రేక్షకులతో పాటు, టీవీల ముందుకూర్చున్న అభిమానులు షాక్‌ అయ్యారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు