Heavy Rains: వాగులో కొట్టుకుపోయిన ఆవులు, గేదెలు

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

Updated : 28 Jun 2024 18:38 IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. సిర్పూర్ నియోజకవర్గంలోని అందవెల్లి గ్రామ సమీపంలోని పెద్దవాగుకు ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రవాహ ఉద్ధృతి పెరిగింది. ఒక్కసారిగా ఉద్ధృతంగా వచ్చిన వాగులో ఆవులు, గేదెలు, ఎడ్లు దాటే ప్రయత్నంలో కొంత దూరం కొట్టుకుపోయాయి. కాసేపటికి సురక్షితంగా ఒడ్డుకు చేరుకోవడం చూసి యజమానులు ఊపిరిపీల్చుకున్నారు. 

Tags :

మరిన్ని