35 Chinna Katha Kaadu: నాకు నా కొడుకు కావాలి: హత్తుకునేలా ‘35 చిన్న కథ కాదు’ టీజర్‌

‘35 చిన్న కథ కాదు’ చిత్రంతో త్వరలోనే తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు నివేదా థామస్‌. తాజాగా టీజర్‌ విడుదలైంది.

Published : 03 Jul 2024 19:00 IST

నివేదా థామస్‌ ( Nivetha Thomas), విశ్వదేవ్‌ ఆర్‌ (Viswadev R), ప్రియదర్శి (Priyadarshi) ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘35 చిన్న కథ కాదు’ (35 Chinna Katha Kaadu). నందకిశోర్‌ ఇమాని దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ్‌, మలయాళంలో ఆగస్టు 15న విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా చిత్ర బృందం టీజర్‌ని బుధవారం రిలీజ్‌ చేసింది. తిరుపతి నేపథ్యంలో జరిగే ఈ కథలో నివేదా తల్లి పాత్ర పోషించారు. పరీక్షల్లో కనీసం పాస్‌ మార్కులు రానందుకు తండ్రి మందలించగా.. కొడుకు ఇంటి నుంచి వెళ్లిపోవడం.. అతడి కోసం తల్లి ఆరాటపడడం తదితర సన్నివేశాలతో రూపొందిన టీజర్‌ ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా ఉంది.

Tags :

మరిన్ని