Rishi Sunak: రిషి సునాక్‌కు మళ్లీ విజయం దక్కేనా?

బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ జరుగుతోంది. బ్రిటన్ కాలమానం ప్రకారం ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ రాత్రి 10 గంటల వరకు సాగనుంది.

Published : 04 Jul 2024 18:33 IST

బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ జరుగుతోంది. బ్రిటన్ కాలమానం ప్రకారం ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ రాత్రి 10 గంటల వరకు సాగనుంది. కొత్త ప్రధానిని ఎన్నుకునేందుకు పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. యూకే వ్యాప్తంగా దాదాపు 40వేల పోలింగ్ కేంద్రాల్లో జరుగుతోన్న ఓటింగ్‌లో 4 కోట్ల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాని రిషి సునాక్‌కు రెండోసారి విజయం దక్కుతుందా, లేదా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. పోలింగ్ ముగిసిన కాసేపటికే కౌంటింగ్ చేపట్టనున్నారు.

Tags :

మరిన్ని