Plastic: భూగోళాన్ని మింగేస్తోన్న ప్లాస్టిక్‌.. ఎందుకు అరికట్టలేకపోతున్నాం?

ప్లాస్టిక్‌ నివారణపై ఎంతో అవగాహన కల్పిస్తున్నా, ఎన్నో చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఉండడం లేదు. మరి, ప్లాస్టిక్‌ సంచులను ఎందుకు అరికట్టలేకపోతున్నాం?

Published : 04 Jul 2024 15:53 IST

చూడటానికి బాగుంటుంది. రంగు రంగుల వర్ణాల్లో లభిస్తుంది. కాలు బయటపెడితే నేనే మీకు దిక్కంటుంది. అలా అని దగ్గరయ్యామో మీ అంతు చూస్తానంటుంది. పోనీ దూరం పెడదామా అంటే అది లేనిదే పని జరగని పరిస్థితి. ఇలా మనుషుల జీవితంలో భాగమైపోయి మనతోనే జీవిస్తానంటుంది. ఈ ఉపోద్ఘాతం అంతా ప్లాస్టిక్‌ సంచి గురించి. మనకు మేలు చేస్తున్నట్లు పైకి కనిపిస్తున్నా ఏటా టన్నుల కొద్దీ ప్లాస్టిక్‌ సంచులు చెత్తకుప్పల్లోకి, అక్కడి నుంచి భూమి పొరల్లోకి చేరుతూ పర్యావరణానికి తీరని నష్టం కల్గిస్తున్నాయి. ప్లాస్టిక్‌ నివారణపై ఎంతో అవగాహన కల్పిస్తున్నా, ఎన్నో చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఉండడం లేదు. మరి, ప్లాస్టిక్‌ సంచులను ఎందుకు అరికట్టలేకపోతున్నాం? ఈ వీడియోలో తెలుసుకుందాం.

Tags :

మరిన్ని