Heavy Rains: అనంతపురం జిల్లాలో జోరు వాన.. లోతట్టు ప్రాంతాలు జలమయం

అనంతపురం జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జోరుగా వానలు కురిశాయి. నగరంలో రాత్రి దాదాపు మూడు నుంచి నాలుగు గంటల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 

Published : 03 Jun 2024 13:24 IST

అనంతపురం జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జోరుగా వానలు కురిశాయి. నగరంలో రాత్రి దాదాపు మూడు నుంచి నాలుగు గంటల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బస్టాండ్ పరిసర ప్రాంతం స్విమ్మింగ్ పూల్‌ను తలపించింది. బెలుగుప్ప మండలంలో 84.2 అధిక వర్షపాతం నమోదైంది. రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు పొంగిపొర్లుతున్నాయి. బూదగవి వంక వర్షపు నీటితో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రాయదుర్గం నియోజకవర్గంలో ఆదివారం రాత్రి భారీగా వర్షం కురిసింది. వాగులు వంకలు వరద నీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. వేదవతి హగరికి జలకళ సంతరించుకుంది. డి.హీరేహాల్‌ మండలం చెర్లోపల్లి వద్ద బొమ్మనహల్ సెక్షన్ పరిధిలోని హెచ్‌ఎల్సీ కాల్వకు భారీగా వరద వచ్చింది. చెర్లోపల్లి వద్ద హెచ్‌ఎల్సీ అండర్‌ టన్నెల్‌ ఛానల్‌కు రంధ్రం పడి వంకలోకి వరద నీరు వృధాగా వెళుతున్నాయి.

Tags :

మరిన్ని