T20 World Cup: ఓకే ఓవర్‌లో 36 పరుగులు.. నికోలస్‌ పూరన్‌ విధ్వంసం

టీ20 ప్రపంచ కప్‌(T20 World Cup)లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటర్‌ నికోలస్ పూరన్ (Nicholas Pooran)(98; 53 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లు)  విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడాడు.

Updated : 19 Jun 2024 10:59 IST

టీ20 ప్రపంచ కప్‌(T20 World Cup)లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటర్‌ నికోలస్ పూరన్ (Nicholas Pooran)(98; 53 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లు)  విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడాడు. అజ్మతుల్లా వేసిన నాలుగో ఓవర్‌లో ఏకంగా 36 పరుగులు రాగా.. పూరన్‌ 26 పరుగులు రాబట్టాడు. ఈ ఓవర్‌లో వరుసగా 6, 4+ నో బాల్, వైడ్‌ + 4, 0,  లెగ్‌ బై రూపంలో ఫోర్,  4, 6, 6 వచ్చాయి. అయితే అతడు ఈ మ్యాచ్‌లో త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. 

Tags :

మరిన్ని