Assam Flood: అసోంలో వరదల బీభత్సం.. జలదిగ్బంధంలో 2 వేల గ్రామాలు

అసోంలో వరదల బీభత్సం కొనసాగుతోంది. దాదాపు 16 లక్షల మందిపై.. వరదలు తీవ్ర ప్రభావం చూపాయి.

Updated : 04 Jul 2024 14:30 IST

అసోంలో వరదల బీభత్సం కొనసాగుతోంది. దాదాపు 16 లక్షల మందిపై.. వరదలు తీవ్ర ప్రభావం చూపాయి. బ్రహ్మపుత్ర దాని ఉపనదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో అసోంను భారీ వరదలు చుట్టుముట్టాయి. వరదలు కారణంగా ఇప్పటి వరకు ఎనిమిది మంది మృతి చెందారు. ముగ్గురు గల్లంతయ్యారు. 27 జిల్లాల్లోని 16,25,000 మందిపై వరద ప్రభావం పడింది. 3,86,950 మంది వరద బాధితులు 515 పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. 2,800 గ్రామాలు నీట మునిగాయి. 42,476 హెక్టార్ల పంట పొలాలు దెబ్బతిన్నాయి. రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాలు వరదల దాటికి ధ్వంసమయ్యాయి. ఇప్పటి వరకు వరదల్లో చిక్కుకున్న 8,400 మందిని సహాయక సిబ్బంది కాపాడారని.. అధికారులు తెలిపారు. పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారికి ఆహారం, మందులు అందిస్తున్నట్లు చెప్పారు.

Tags :

మరిన్ని