India-Pak Ties: భారత్‌-పాక్‌ సంబంధాలపై.. అమెరికా ఏమన్నదంటే?

భారత్‌-అమెరికాల మధ్య ఆర్థిక, భద్రతా రంగాల్లో ఎంతో సహకారం ఉందని, ఇదే ఒరవడిని ఇకముందు కొనసాగిస్తామని అగ్రరాజ్యం స్పష్టం చేసింది.

Updated : 02 Jul 2024 15:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అనేక అంశాల్లో భారత్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటున్నామని అగ్రరాజ్యం పేర్కొంది. ముఖ్యంగా ఆర్థిక, భద్రతా రంగాల్లో ఎంతో సహకారం ఉందని, ఇదే ఒరవడిని ఇకముందు కొనసాగిస్తామని స్పష్టంచేసింది.  భారత్‌-పాక్‌ సంబంధాలపై స్పందిస్తూ.. ఉగ్రవాదం ఉన్నంతకాలం శత్రుదేశంతో చర్చలు జరపలేమని భారత్‌ చెప్పిన విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ మరోసారి గుర్తుచేసింది.

అమెరికాలో బిలియన్‌ డాలర్ల స్కామ్‌లో భారతీయులకు జైలు

‘‘భారత్‌-పాక్‌ మధ్య ఉగ్రవాదం అంశం ప్రధానంగా కొనసాగుతోంది. ఏ దేశమైనా వారి పొరుగుదేశంతో సత్సంబంధాలు కోరుకుంటే స్వాగతిస్తాం. కానీ, ఉగ్రవాదం విషయంలో మాత్రం ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు. భూమి మీద ఉగ్రవాదం ఎక్కడున్నా ఏ దేశమైనా ఖండించాల్సిందే’’ అని అమెరికా విదేశాంగ అధికార ప్రతినిధి వేదాంత్‌ పటేల్‌ పేర్కొన్నారు. ఆర్థిక సంబంధాలు, భద్రతా సహకారంతోపాటు పలు రంగాల్లో భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకుంటున్నామన్నారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు కూడా ఇటీవల భారత్‌లో పర్యటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇటీవల జరిగిన జీ7 సదస్సులోనూ ప్రధాని మోదీతో మాట్లాడే అవకాశం అధ్యక్షుడు జో బైడెన్‌కు వచ్చిందన్నారు.

పొరుగుదేశంతో భారత్‌ సత్సంబంధాలు కోరుకుంటుందని, ఇదే సమయంలో ఉగ్రవాదం, చర్చలు ఒకేసారి కొనసాగలేవని ప్రధాని మోదీ పలుమార్లు స్పష్టంచేశారు. ఇదే విషయంపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి పైవిధంగా స్పందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని