- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
‘థాంక్యూ సర్’.. అన్నందుకు విమానం దించేశారు!
మహిళా సిబ్బందిని ఓ ప్రయాణికురాలు పొరబాటుగా పురుషుడిగా భావించింది. బోర్డింగ్ పాస్ అందించినందుకు ‘థాంక్యూ సర్’ అని చెప్పినందుకు విమానం నుంచి దించేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: విమాన ప్రయాణానికి సిద్ధమైన ఓ ప్రయాణికురాలికి చేదు అనుభవం ఎదురైంది. మహిళా సిబ్బందిని పొరపాటున ‘సర్’ అన్నందుకు విమానం నుంచి దించేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో చోటుచేసుకుంది.
అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నుంచి ఆస్టిన్ బయలుదేరేందుకు విమానం సిద్ధమైంది. టెక్సాస్‌కు చెందిన జెన్నా లాంగోరియా తన కుమారుడు, తల్లితో విమానం ఎక్కే సమయంలో సిబ్బంది బోర్డింగ్ పాస్‌ను అందించారు. దీంతో మహిళా అటెండెంట్‌ను పొరపాటుగా పురుషునిగా భావించి.. ‘థాంక్యూ సర్’ అని తెలిపింది. దీంతో ఆమె ఆగ్రహానికి గురైంది. ప్రయాణికురాలి తల్లిని, బిడ్డను లోనికి వెళ్లకుండా ఆపేసింది.
అమెరికా సాక్షిగా.. హాంకాంగ్‌లో ఒక్కటైన 10 స్వలింగ జంటలు
అదే సమయంలో జెన్నా మరో మేల్ ఫ్లైట్ అటెండెంట్ సాయం కోరింది. తన తల్లి, కుమారుడిని ఆయన గేట్ వద్ద ఆపేశారని ఫిర్యాదు చేసింది. దీంతో ఆ మేల్ ఫ్లైట్ అటెండెంట్.. ఆ సిబ్బంది ‘ఆయన’ కాదు ‘ఆమె’ అని బదులిచ్చారు. తన తప్పును తెలుసుకుని ఆ మహిళా సిబ్బందికి క్షమాపణలు చేప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోకపోగా.. విమానం నుంచి దింపేశారని సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.