Human Trafficking: ఆ ఉద్యోగి జీతం కంటే.. ఆ శునకం కోసమే ఎక్కువ ఖర్చట!

భారత సంతతికి చెందిన హిందూజా గ్రూప్‌ కుటుంబం శ్రమదోపిడికి పాల్పడుతోందనే ఆరోపణలు వచ్చాయి.

Published : 19 Jun 2024 00:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్రిటన్‌లో అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న భారత సంతతికి చెందిన హిందూజా గ్రూప్‌ కుటుంబం చిక్కుల్లో పడింది. స్విట్జర్లాండ్‌లోని లేక్‌ జెనీవా విల్లాలో పనిచేసేవారిపై ఆ కుటుంబం శ్రమదోపిడికి పాల్పడుతోందనే ఆరోపణలు వచ్చాయి. సిబ్బందిలో ఒకరి జీతం కంటే.. పెంపుడు శునకం కోసమే ఎక్కువ ఖర్చు చేశారనేది ప్రధాన ఆరోపణ. మానవ అక్రమ రవాణా అభియోగాల కింద ఈ వ్యవహారంపై కేసు నమోదు కాగా.. స్విస్‌ కోర్టు విచారణ చేపట్టింది. ఇందుకు సంబంధించి అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.

పనిచేసే సిబ్బంది పాస్‌పోర్టులను తమ దగ్గరే పెట్టుకున్నట్లు హిందూజా కుటుంబంపై ఆరోపణలు వచ్చాయి. వారి అనుమతి లేకుండా బయటకు వెళ్లనిచ్చేవారు కాదట. హిందూజా కుటుంబంలో పనిచేసే సిబ్బంది కంటే పెంపుడు శునకానికే ఎక్కువ ఖర్చు చేస్తున్నారని తెలిసింది. ఓ మహిళా ఉద్యోగి రోజుకు 15 నుంచి 18 గంటలపాటు పనిచేస్తే.. 6.19 పౌండ్లకంటే తక్కువ చెల్లిస్తున్నారని బాధిత మహిళ తరఫు న్యాయవాది వెల్లడించారు. అదే.. వారి ఇంట్లో శునకానికి మాత్రం ఏడాదికి 7615 పౌండ్లు ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. హిందూజా కుటుంబంలో నలుగురిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

శ్రమదోపిడిపై వచ్చిన ఆరోపణలను హిందూజా కుటుంబం తరఫు న్యాయవాది తోసిపుచ్చారు. సిబ్బంది నియామకానికి సంబంధించి ఆ కుటుంబీకులకు ఎటువంటి సంబంధం లేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు