Rishi Sunak: ఆ దూషణలు నన్నెంతో బాధించాయి - రిషి సునాక్‌

రిఫార్మ్‌ పార్టీకి చెందిన ఓ నేత తనపై చేసిన జాత్యాహంకార దూషణలు ఎంతో బాధించాయని, ఆగ్రహం కూడా తెప్పించాయని రిషి సునాక్‌ పేర్కొన్నారు.

Published : 29 Jun 2024 00:13 IST

లండన్‌: బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ముమ్మర ప్రచారంలో మునిగితేలుతున్న నాయకులు.. వ్యక్తిగత విమర్శలకూ దిగుతున్నారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి రిషి సునాక్‌పై ప్రత్యర్థి పార్టీకి చెందిన ఓ నేత జాత్యాహంకార దూషణలు చేయడం చర్చనీయాంశమైంది. ఆయన వ్యాఖ్యలతో తానెంతో బాధపడ్డానని, అవి ఆగ్రహం కూడా తెప్పించాయని సునాక్‌ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఆ వ్యాఖ్యలను తన ఇద్దరు కుమార్తెలు వినాల్సి వచ్చిందన్నారు.

‘‘అవి నన్నెంతో బాధించాయి. కోపాన్ని కూడా తెప్పించాయి. ఆ పదాలను పునరావృతం చేయను. రిఫార్మ్‌ పార్టీ అభ్యర్థులు, ప్రచారకులు జాత్యాహంకార, స్త్రీద్వేష భాషను మాట్లాడుతున్నారు. ఇవి చూస్తుంటే ఆ పార్టీలో సంస్కృతి ఏవిధంగా ఉందో మీకు అర్థమవుతుంది’’ అని రిషి సునాక్‌ పేర్కొన్నారు. దక్షిణాసియా ప్రజల సంస్కృతిని ఉద్దేశిస్తూ రిఫార్మ్‌ పార్టీ ప్రచారకుడు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆ పార్టీ నేత నిగెల్‌ ఫరేజ్‌ పలు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉందన్నారు.

నాన్న చనిపోయాడని కట్టుకథ.. అమెరికాలో భారత విద్యార్థి బహిష్కరణ

దీనిపై నిగెల్‌ స్పందిస్తూ.. తమ పార్టీ లేదా మద్దతుదారుల్లో కొందరు వ్యక్తం చేసిన అభిప్రాయాలకు తనకు సంబంధం లేదన్నారు. ఇదిలాఉంటే, జులై 4న బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కన్జర్వేటివ్‌ పార్టీ వెనుకంజలో ఉన్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. ప్రతిపక్ష లేబర్‌ పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటున్నాయి. రిఫార్మ్‌ పార్టీ కూడా వందలాది అభ్యర్థులను బరిలో నిలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని