China: రక్షణశాఖ మాజీ మంత్రులపై జిన్‌పింగ్‌ వేటు.. అవినీతే కారణం!

ఇద్దరు చైనా రక్షణశాఖ మాజీ మంత్రులపై అధికార కమ్యూనిస్ట్ పార్టీ బహిష్కరణ వేటు వేసింది.

Published : 28 Jun 2024 00:11 IST

బీజింగ్‌: అవినీతిపరులను అణచివేస్తానని పేర్కొన్న చైనా (China) అధ్యక్షుడు జిన్‌పింగ్‌.. ఈ దిశగా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దేశ రక్షణశాఖ మంత్రులుగా పనిచేసిన జనరల్‌ వే ఫంగ్హా (70), జనరల్‌ లీ షాంగ్‌ఫు (66)లపై జిన్‌పింగ్‌ నేతృత్వంలోని అధికార చైనా కమ్యూనిస్టు పార్టీ బహిష్కరణ వేటు వేసింది. అవినీతికి పాల్పడినట్లు సైన్యం దర్యాప్తులో తేలిన నేపథ్యంలో ఇద్దరిపై విచారణను ప్రారంభించినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది.

అవినీతి చర్యలతో పార్టీ క్రమశిక్షణ, చట్టాల విషయంలో తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడినందుకుగాను ఇద్దరిపై వేటు పడినట్లు చైనా అధికారిక వార్తాసంస్థ వెల్లడించింది. ఫంగ్హా 2018- 23 మధ్యకాలంలో, ఆయన అనంతరం షాంగ్‌ ఫూ కొన్ని నెలలపాటు చైనా రక్షణశాఖ మంత్రులుగా విధులు నిర్వర్తించారు. పార్టీ స్టేట్ కౌన్సిలర్లు, సెంట్రల్ మిలిటరీ కమిషన్ సభ్యులుగా పనిచేశారు. ఇద్దరూ తమ అధికారాలను దుర్వినియోగం చేశారని, బదులుగా భారీ మొత్తంలో డబ్బు, విలువైన వస్తువులను స్వీకరించారని సైన్యం దర్యాప్తులో తేలింది.

పాక్‌ ఎన్నికలపై దర్యాప్తునకు అమెరికా ప్రతినిధుల సభ తీర్మానం

చైనా మాజీ విదేశాంగ మంత్రి చిన్‌ గాంగ్‌తోపాటు ఈ ఇద్దరూ గత ఏడాది నుంచి ప్రజాజీవితంలో కనిపించకుండా పోయారు. అయితే.. ఫంగ్హా మాత్రం సుదీర్ఘ కాలం తర్వాత ఈ ఏడాది మేలో ఓ కార్యక్రమంలో కనిపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని