Myanmar: ఉద్యోగులకు జీతాలు పెంచారని.. యజమానులకు జైలు

Myanmar: తమ వద్ద పనిచేసే ఉద్యోగులకు వేతనాలు పెంచారని కొందరు దుకాణదారులకు జైలు శిక్ష విధించారు. ఈ వింత ఘటన మయన్మార్‌లో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..?

Published : 03 Jul 2024 12:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సైన్యం పాలనలో మయన్మార్‌ (Myanmar) ప్రజలు తీవ్రంగా సతమతమవుతున్నారు. సైన్యం కఠిన చట్టాల కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఉద్యోగులకు జీతాలు పెంచారన్న (Wage Hike) కారణంతో కొంతమంది దుకాణ యజమానులను అక్కడి సైనిక ప్రభుత్వం జైలుకు పంపించింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న వేళ సిబ్బందికి వేతనాలను పెంచడం నేరంగా పరిగణించింది.

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కనీసం 10 మంది దుకాణదారులకు ఇదే కారణంతో మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేగాక, వారి వ్యాపారాలను బలవంతంగా మూసివేయించింది. మయన్మార్‌లో వేతనాల పెంపు చట్ట విరుద్ధమేమీ కాదు. కానీ, ద్రవ్యోల్బణ ఆందోళనల వేళ ఇలా జీతాలు పెంచడం వల్ల సమాజంలో అశాంతి నెలకొంటుందని సైన్యం (Military Government) భావిస్తోందట. ఇదే విషయాన్ని ఆయా దుకాణాల ముందు అంటించిన నోటీసుల్లో పేర్కొంది. వీరు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆరోపించింది.

బెంబేలెత్తించిన బెరిల్‌.. మొత్తం ద్వీపం ధ్వంసం!

ప్రజస్వామ్యయుతంగా ఎన్నికైన ఆంగ్‌సాన్‌ సూకీ ప్రభుత్వాన్ని 2021లో సైన్యం కూలదోసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి దేశంలో మిలటరీ పాలనలో ఉండగా.. తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిత్యావసర ధరలు పెరగడం ఇతరత్రా సమస్యలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అదే సమయంలో ప్రజాస్వామ్య అనుకూలవాదులతో కూడిన సాయుధ బృందాలు కూటములుగా ఏర్పడి సైన్యంపై తిరుగుబాట్లు చేస్తున్నాయి. దీంతో దేశంలో అస్థిరత నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు