ఆ దేశంలో తెల్లని వెడ్డింగ్ గౌను వేసుకున్నా.. వైన్‌ గ్లాసుల్లో మద్యం తాగినా..!

కిమ్ (Kim Jong Un) నియంతృత్వ రాజ్యంలో ఆంక్షలు చిత్రంగా ఉంటాయి. ప్రజల అభిరుచులపై సైతం ఆయన కఠిన చర్యలు తీసుకున్న సందర్భాలున్నాయి. 

Updated : 02 Jul 2024 00:08 IST

ఇంటర్నెట్‌డెస్క్: పాశ్చాత్య దేశాలు, దక్షిణ కొరియా ఛాయలు దేశ ప్రజలపై పడకుండా ఉత్తరకొరియా ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకుంటుంది. ఆ దేశాల సంస్కృతి, సంగీతం, భాష తమ రాజ్యంలోకి రాకుండా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ (Kim Jong Un) జాగ్రత్తపడుతుంటారు.  ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం..

కిమ్ ప్రభుత్వ అణచివేతను తీవ్రంగా వ్యతిరేకించిన 600 మందికిపైగా ఆ దేశ ప్రజలు వెల్లడించిన వివరాల ఆధారంగా దానిని తయారు చేసింది. తమ ప్రజలపై బయటి ప్రభావం ఏమైనా ఉందా తెలుసుకునేందుకు కిమ్ సిబ్బంది అన్ని ఇళ్లను సోదా చేస్తుంటారు. 2021 నుంచి ఆ తనిఖీలు తీవ్రమయ్యాయి. తెల్లటి వివాహ గౌను ధరించడం, పెళ్లి కుమారుడు వధువును తన వీపుపై ఎక్కించుకోవడం వైన్ గ్లాసుల్లో మద్యం తాగడం..వంటి వాటిని పొరుగుదేశం పద్ధతులుగా ఉ.కొరియా భావిస్తుంది. అందుకే వాటిని గుర్తించి అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే  సన్‌గ్లాసెస్‌ కూడా ఆ దేశం అంగీకరించదు. కానీ కిమ్ మాత్రం వాటిని ధరిస్తుంటారు. ఈ గౌన్‌, గ్లాసెస్, దక్షిణ కొరియా యాస మాట్లాడుతూ దొరికిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో స్పష్టత లేనప్పటికీ.. అలాంటి వాటి ప్రభావం ప్రజలపై పడటాన్ని మాత్రం అంగీకరించదని తెలుస్తోంది.

చాలా విచిత్రమైన నిబంధనలతో అక్కడి ప్రజల వ్యక్తిగత అభిరుచులను సైతం కిమ్‌ శాసిస్తుంటారు. సౌందర్య ఉత్పత్తుల దగ్గర నుంచి దుస్తులు, చివరకు హెయిర్‌స్టైల్‌పై కూడా ఆంక్షలు అమలు చేస్తున్నారు. మహిళలు రెడ్‌ లిప్‌స్టిక్‌ వాడొద్దనే మరో నిబంధనను తీసుకొచ్చినట్లు గతంలో కొన్ని కథనాలు వెలువడ్డాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని