Melania Trump: ట్రంప్‌ అధ్యక్షుడిగా ఎన్నికైతే..: మెలానియా ఏం చేయనున్నారు!

అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌(Biden), ట్రంప్(Trump) మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్, ఆయన సతీమణి మధ్య ఒక డీల్‌ కుదిరిందని తెలుస్తోంది. 

Published : 01 Jul 2024 18:07 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరు రోజురోజుకూ తీవ్రమవుతోంది. అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden), మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ సమయంలో జిల్‌ బైడెన్ తన భర్త వెన్నంటే ఉంటున్నారు. కానీ ట్రంప్ సతీమణి మెలానియా మాత్రం ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు. ఇటీవల ఓ కేసుకు సంబంధించి ట్రంప్‌ను న్యాయస్థానం దోషిగా నిర్ధరించింది. ఈ వార్తల నేపథ్యంలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. వారి మధ్య ఒక డీల్ కుదిరినట్లు సమాచారం.

‘‘ఒకవేళ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే.. పూర్తిస్థాయిలో ప్రథమ మహిళగా బాధ్యతలు చూసుకోలేనంటూ తన భర్తతో ఆమె డీల్ చేసుకున్నారు’’ అంటూ సంబంధిత వర్గాలు మీడియాకు వెల్లడించాయి. తన కుమారుడు బ్యారన్‌ ట్రంప్‌నకు ఎక్కువ సమయం కేటాయించేందుకు దీనిని కుదుర్చుకున్నట్లు పేర్కొన్నాయి. 18 ఏళ్ల బ్యారన్‌ ఇప్పుడు యూనివర్సిటీలో చేరేందుకు న్యూయార్క్‌ వెళ్లనున్నారు. తన కుమారుడు జీవితంలో మరో అడుగు ముందుకు వేస్తోన్న తరుణంలో అతడికి మద్దతుగా వెంట ఉండాలని ఆమె భావిస్తున్నారట. ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత బ్యారన్‌పై ఉండే ప్రత్యేక దృష్టి గురించి ఆమె ఆందోళన చెందుతున్నారట. ఆ కారణాల వల్లే ఆమె కుమారుడికే ఎక్కువ సమయం కేటాయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

స్పీకర్‌జీ.. సూటిగా చూడరేం.. ఎంపీ వీడియో వైరల్‌

ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మెలానియా నిత్యం ఆయన వెన్నంటే ఉండేవారు. అధికార, ప్రైవేటు కార్యక్రమాల్లోనూ పక్కనే ఉండేవారు. అధ్యక్ష పదవి కోల్పోయిన తర్వాత ఆయన నిర్వహించిన ఏ ర్యాలీలోనూ ఆమె కనిపించలేదు. ఇతర కార్యక్రమాల్లోనూ అరుదుగానే కనిపించారు. ‘‘శృంగార తార స్టార్మీ డేనియల్‌తో వివాదం కేసులో నేను దోషిగా తేలడం మెలానియాకు మింగుడు పడకపోయి ఉంటుంది. అందుకే ఆమె రాలేదేమో!’’ అని గతంలో ట్రంప్‌ అన్నారు. అంతటి క్లిష్ట సమయంలో ఆమె వెంట లేకపోవడం గురించి ఆయన ఆ విధంగా స్పందించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని