Israel: సెర్బియాలోని ఇజ్రాయెల్‌ ఎంబసీ వద్ద దాడి

సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్‌లో ఉన్న ఇజ్రాయెల్‌ ఎంబసీవద్ద విల్లులాంటి ఆయుధంతో వచ్చిన దుండగుడు భద్రతాధికారిపై దాడి చేసి గాయపరిచాడు. వెంటనే తేరుకున్న అధికారి కాల్పులు జరిపి నిందితుడిని హతమార్చారు.

Published : 30 Jun 2024 05:09 IST

భద్రతాధికారికి గాయాలు
నిందితుడిని కాల్చి చంపిన అదే అధికారి

బెల్‌గ్రేడ్‌: సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్‌లో ఉన్న ఇజ్రాయెల్‌ ఎంబసీవద్ద విల్లులాంటి ఆయుధంతో వచ్చిన దుండగుడు భద్రతాధికారిపై దాడి చేసి గాయపరిచాడు. వెంటనే తేరుకున్న అధికారి కాల్పులు జరిపి నిందితుడిని హతమార్చారు. శనివారం ఈ ఘటన జరిగిందని సెర్బియా హోంశాఖ వెల్లడించింది. ఎంబసీ వద్దకు వచ్చిన దుండగుడు భద్రతాధికారి మెడలోకి దూసుకెళ్లేలా మేకులాంటి పరికరాన్ని ప్రయోగించాడు. మెడలో మేకు దిగినా వెంటనే తేరుకున్న అధికారి తన ఆయుధంతో కాల్పులు జరిపారు. దీంతో నిందితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అధికారిని ఆసుపత్రికి తరలించి మెడలోకి దిగిన మేకును తొలగించారు. ఇది ఉగ్రదాడేనని ఇజ్రాయెల్‌ విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. అమెరికా ఎంబసీకి సమీపంలోనే ఇజ్రాయెల్‌ ఎంబసీ ఉంది.

ఎర్ర సముద్రంలో క్షిపణుల దాడి

ఎర్ర సముద్రంలో నౌక లక్ష్యంగా శుక్రవారం హూతీ రెబల్స్‌ 5 క్షిపణులను ప్రయోగించారు. హోడైడా సమీపంలో ఈ దాడి జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని