Maldives: మాల్దీవులు అధ్యక్షుడిపై చేతబడి!

మాల్దీవులు అధ్యక్షుడు మొహమ్మద్‌ ముయిజ్జుపై చేతబడి (బ్లాక్‌ మ్యాజిక్‌) చేశారన్న ఆరోపణలతో ఇద్దరు మంత్రులను పోలీసులు అరెస్టు చేసినట్లు స్థానిక మీడియా కథనాలు గురువారం వెల్లడించాయి.

Updated : 28 Jun 2024 15:06 IST

ఆరోపణలతో ఇద్దరు మంత్రుల అరెస్ట్‌

మాలె: మాల్దీవులు అధ్యక్షుడు మొహమ్మద్‌ ముయిజ్జుపై చేతబడి (బ్లాక్‌ మ్యాజిక్‌) చేశారన్న ఆరోపణలతో ఇద్దరు మంత్రులను పోలీసులు అరెస్టు చేసినట్లు స్థానిక మీడియా కథనాలు గురువారం వెల్లడించాయి. పర్యావరణ శాఖలో సహాయమంత్రిగా విధులు నిర్వహిస్తున్న షమ్నాజ్‌ సలీం, ఈమె మాజీ భర్త అయిన అధ్యక్షుడి కార్యాలయ మంత్రి ఆదం రమీజ్‌లతోపాటు మరో ఇద్దరిని ఈ ఆరోపణల కింద అరెస్టు చేసినట్లుగా పోలీసులు వెల్లడించినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. అయితే, పోలీసులు ఈ అరెస్టులపై బహిరంగంగా పెదవి విప్పడం లేదు. ‘‘షమ్నాజ్‌తోపాటు మరో ఇద్దరిని ఆదివారం అరెస్టు చేయగా, ఈ ముగ్గురికీ ఏడు రోజుల కస్టడీ రిమాండు విధించారు. బుధవారం ఆమెను పర్యావరణశాఖ మంత్రి పదవి నుంచి తొలగించారు. అలాగే రమీజ్‌ను గురువారం మంత్రి పదవి నుంచి తప్పించారు’’ అని ఓ న్యూస్‌ పోర్టల్‌ వివరించింది. గతంలో ముయిజ్జు మాలె సిటీ మేయర్‌గా విధులు నిర్వహించినపుడు సైతం షమ్నాజ్, రమీజ్‌ కౌన్సిలర్లుగా ఆయనతో కలిసి పనిచేశారు. తాజా పరిణామాలపై మాల్దీవులు ప్రభుత్వం కానీ, అధ్యక్షుడి కార్యాలయం కానీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని