Keir Starmer: యూకే నూతన ప్రధానిగా కీర్‌ స్టార్మర్‌.. కింగ్ ఛార్లెస్-3 ఆమోదం

యూకే కొత్త ప్రధానిగా కీర్‌ స్టార్మర్ (Keir Starmer) నియామకానికి రాజు ఛార్లెస్‌-3 ఆమోదం తెలిపారు. 

Published : 05 Jul 2024 18:25 IST

లండన్‌: పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘనవిజయంతో.. యూకే తదుపరి ప్రధానిగా కీర్‌ స్టార్మర్‌ నియమితులయ్యారు. కింగ్ ఛార్లెస్-3 ఆయన నియామకాన్ని ఆమోదించారు. ఫలితాల అనంతరం స్టార్మర్‌.. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో రాజును మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుచేయాలని ఆయన్ను ఆహ్వానించారు. ఈ భేటీకి సంబంధించిన చిత్రాన్ని రాజ కుటుంబం ఎక్స్‌ వేదికగా షేర్ చేసింది. రాజును కలిసిన అనంతరం నూతన ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేశానికి మొదటి ప్రాధాన్యమని, తర్వాతే పార్టీ అని స్పష్టం చేశారు. ప్రజాసేవ ఒక గౌరవం అని వ్యాఖ్యానించారు. శుక్రవారం జరిగిన ఎన్నికల కౌంటింగ్‌లో లేబర్‌ పార్టీ నాలుగు వందలకు పైగా సీట్లు దక్కించుకోగా.. కన్జర్వేటివ్ పార్టీ 120 సీట్ల దగ్గర ఆగిపోయింది. ఇక దీనికి ముందు రిషి సునాక్‌.. ప్రధాని అధికార నివాసం ముందు చివరి ప్రసంగం చేసి, రాజును కలిసి రాజీనామా సమర్పించిన సంగతి తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని