Khan Younis: ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయండి..! గాజావాసులకు ఇజ్రాయెల్ మరోసారి ఆదేశం

గాజాలోని ఖాన్‌ యూనిస్‌ నగరం తూర్పు ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ స్థానికులకు ఇజ్రాయెల్ మరోసారి ఆదేశాలు జారీ చేసింది.

Published : 02 Jul 2024 00:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇజ్రాయెల్‌ (Israel) బలగాల ఉపసంహరణతో తమ నివాసాలకు తిరిగి చేరుకున్న దక్షిణ గాజాలోని ఖాన్‌ యూనిస్‌ (Khan Younis) వాసులకు మరోసారి షాక్‌ తగిలింది. ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నామని భావిస్తోన్న తరుణంలో.. నగరం తూర్పు ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో గాజా (Gaza)లో రెండో అతిపెద్ద నగరమైన ఖాన్‌ యూనిస్‌లోకి టెల్‌అవీవ్‌ సేనలు మరోసారి అడుగుపెట్టే అవకాశం ఉందనే కథనాలు వెలువడుతున్నాయి. హమాస్‌ ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో మళ్లీ ఒక్కచోటికి చేరారనే సంకేతాలతో దాడులకు వీలుగా ఈ ప్రకటన చేసినట్లు సమాచారం. మరోవైపు.. రఫాలో దాడులు ముగింపు దశలో ఉన్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది.

మహ్మద్‌ అబు సల్మియాను విడుదల చేసిన ఇజ్రాయెల్‌

ఖాన్‌ యూనిస్‌ జనాభా 14 లక్షలు. గాజా జనాభాలో సగం ఇక్కడే ఉండేది. హమాస్‌ అంతమే లక్ష్యంగా గత ఏడాది అక్టోబర్‌ 7న యుద్ధం మొదలుపెట్టిన ఇజ్రాయెల్‌.. డిసెంబర్‌లో ఈ నగరంపైకి సేనలను పంపించింది. హమాస్‌ ఉగ్రవాదులకు కీలక స్థావరంగా ఉన్న ఈ ప్రాంతాన్ని జల్లెడ పట్టింది. ఒకప్పుడు భారీ భవంతులు, వాణిజ్య సముదాయాలతో కళకళలాడిన ఈ నగరం.. ఇజ్రాయెల్‌ సేనల దాడులతో నామరూపాల్లేకుండా పోయింది. ఖాన్‌ యూనిస్‌ ప్రాంతం నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఇజ్రాయెల్‌ దళాలు ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించాయి. దీంతో కొన్ని నెలలుగా తమ నివాసాలకు దూరంగా తలదాచుకున్న వేల కుటుంబాలు సొంత గూటికి తిరిగి చేరుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని