Indian Student: నాన్న చనిపోయాడని కట్టుకథ.. అమెరికాలో భారత విద్యార్థి బహిష్కరణ

అమెరికాలో చదువుతోన్న ఓ భారత విద్యార్థి.. స్కాలర్‌షిప్ కోసం ఏకంగా తన తండ్రి చనిపోయినట్లు ధ్రువీకరణ పత్రం సృష్టించినట్లు వెలుగు చూసింది.

Published : 28 Jun 2024 17:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తప్పుడు పత్రాలతో అమెరికాలో అడ్మిషన్‌ పొందిన ఓ భారతీయ విద్యార్థి నాటకం బయటపడింది. స్కాలర్‌షిప్ కోసం ఏకంగా తన తండ్రి చనిపోయినట్లు ధ్రువీకరణ పత్రం సృష్టించడం గమనార్హం. ఈ విషయాన్ని గుర్తించిన అక్కడి అధికారులు అతడిపై బహిష్కరణ వేటు వేశారు. త్వరలోనే స్వదేశానికి పంపించనున్నారు.

భారత్‌కు చెందిన ఆర్యన్‌ ఆనంద్‌.. 2023 ఆగస్టులో పెన్సిల్వేనియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ లేహీలో అడ్మిషన్‌ పొందాడు. ఈ క్రమంలో తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించాడు. పదో తరగతి పరీక్ష ఫలితాలనూ ఫోర్జరీ చేసిన అతడు.. పూర్తి స్కాలర్‌షిప్‌ కోసం అక్రమ మార్గాలను ఆశ్రయించాడు. తండ్రి బతికే ఉన్నప్పటికీ.. ఆయన చనిపోయినట్లు తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించాడు. ఇలా ఏడాది గడిచింది.

ట్రంప్‌ దూకుడు.. బైడెన్‌ తడబాటు.. ఆసక్తికరంగా అధ్యక్ష అభ్యర్థుల చర్చ

ఈ క్రమంలో ‘అసత్యాలతోనే నా జీవితం మొత్తాన్ని నిర్మించుకున్నాను’ అంటూ సోషల్‌ మీడియాలో తన గురించి ప్రగల్భాలు పలుకుతూ ఓ పోస్టు పెట్టాడు. పదో తరగతి బోర్డు ఫలితాలను తారుమారు చేసిన తీరు, తప్పుడు ధ్రువపత్రాలతో అమెరికా కాలేజీలో చేరిన తీరును పేర్కొన్నాడు. అనంతరం చదువుపై ఆసక్తి కోల్పోవడం, స్కాలర్‌షిప్‌ కోసం పరీక్షల్లో మోసాలకు పాల్పడటం, తప్పుడు ఇంటర్న్‌షిప్‌ల గురించి వివరించాడు.

ఈ విషయం అక్కడి అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో జూన్‌ 12న ఆనంద్‌ను అరెస్టు చేశారు. ఈ కేసులో దాదాపు 20 ఏళ్ల వరకు శిక్షపడే అవకాశం ఉంది. అయితే, యూనివర్సిటీ అధికారుల అభ్యర్థన మేరకు అతడిపై బహిష్కరణ వేటు వేశారు. దీంతో త్వరలోనే అతడు భారత్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు