వాస్తవాధీన రేఖను గౌరవించాల్సిందే

వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)ను గౌరవించాల్సిందేనని చైనాకు భారత్‌ స్పష్టం చేసింది. సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పేందుకు కృషి చేయాలని సూచించింది.

Published : 05 Jul 2024 04:54 IST

చైనాకు భారత్‌ స్పష్టీకరణ

ఆస్తానా: వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)ను గౌరవించాల్సిందేనని చైనాకు భారత్‌ స్పష్టం చేసింది. సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పేందుకు కృషి చేయాలని సూచించింది. ఎస్‌సీవో సదస్సు సందర్భంగా ఆస్తానాలో జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ గురువారం విడిగా భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలపై లోతుగా చర్చించారు. సరిహద్దుల్లో నెలకొన్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఇద్దరు నేతలూ తీర్మానించారు. ఇందుకోసం సైనిక, దౌత్య మార్గాల్లో ప్రయత్నాలను వేగవంతం చేసేందుకు అంగీకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని